బడా సినిమాలు అన్నిటిని కబ్జా చేసిన శ్లోకా

Shloka entertainments to release almost all Sankranthi releases in North America

Shloka entertainments to release almost all Sankranthi releases in North America | ఎప్పటిలానే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ రంజుగా ఉండబోతుంది. తప్పుకున్న సినిమాలు పోగా ఇంకా 4 బడా రిలీజులు పోటీలో మిగిలాయి. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహారెడ్డి’, విజయ్ ‘వారసుడు’, అఖిల్ ‘ఏజెంట్’ ప్రస్తుతానికి పోటీలో ఇంకా నిలబడి ఉన్నాయి.

అఖిల్ ఏజెంట్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదనీ, పోస్టుపోన్ దాదాపు ఖాయమనే ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. ఇక మిగిలింది మూడు సినిమాలు. వీటిలో వారసుడు నిర్మాత దిల్ రాజు కాగా, మిగతా రెండిటి నిర్మాతలు మైత్రి వారే. సహజంగానే మైత్రి వారు తమ రెండు సినిమాలూ అన్ని ఏరియాల్లో ఒకే డిస్ట్రిబ్యూటర్ కు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది సహజం. అయితే ….

ఇప్పుడు ‘శ్లోకా ఎంటర్టైన్మెంట్స్’ అనే సంస్థ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు లతోపాటు ఇకముందు రాబోయే రామ్ చరణ్ 15 వ సినిమా, విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకూడా వీరే నార్త్ అమెరికాలో రిలీజ్ చేయబోతున్నారు.

అమెరికాలో తెలుగు సినిమాలకు డిమాండ్ బాగానే ఉంటుంది. అందుకు తగ్గట్టే చాలామంది డిస్ట్రిబ్యూట్ చేసేందుకు పోటీలో ఉంటారు. ప్రస్తుతం అందరికన్నా ఎక్కువకు కోట్ చేసి బడా సినిమాలన్నీ శ్లోకా సొంతం చేసుకుంది.
ఎప్పటికప్పుడు కొత్త సంస్థలు పుట్టుకొచ్చే అమెరికాలో ఈ శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ మాత్రం లాంగ్ రన్ చేసే లాగే అనిపిస్తుంది. కోట్లు వెచ్చించి కొన్న భారీ సినిమాలు వీరిని గట్టెక్కిస్తాయో, లేదో చూడాలి.