నా బోటే కట్టు.. డీజే కొట్టు… బొంబాటు పార్టీ …. వీరయ్య మాస్ సాంగ్ అదిరింది

Waltair Veerayya Party song

Waltair Veerayya Party song | టాలీవుడ్ లో సంక్రాంతి బిగ్గెస్ట్ సీజన్. వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే బెర్త్ లు కన్ఫర్మ్ చేసుకున్నాయి బడా సినిమాలు. కొన్ని సినిమాలు ఆ పోటీ నుంచి తప్పుకున్నా, ఓ నాలుగు సినిమాలు మాత్రం సంక్రాంతి రేస్ లో ఉన్నాయి. వాటిలో రెండు డబ్బింగ్ సినిమాలు కాగా రెండు మోస్ట్ అవైటెడ్ మూవీస్.

నాలుగు దశాబ్దాలనుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న బాలయ్య, చిరంజీవి మరోసారి సంక్రాంతి రేసులో పోటీ పడుతున్నారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు ఇప్పటికైతే ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి.

సంక్రాంతి కి రిలీజ్ పెట్టుకుని, ఇంకా షూటింగ్ దశలోనే ఉండటం రెండు సినిమా యూనిట్లను టెన్షన్ పెడుతుంది. షూటింగ్ పూర్తవ్వాలి, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కార్యక్రమాలు అన్ని పూర్తయి సంక్రాంతికి సినిమాలు విడుదల చేయగలరా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక అసలు విషయానికి వస్తే ….

బాలయ్య, చిరంజీవి సినిమాలు పోటీ పడటం కొత్తేమి కాకపోయినా, ఈసారి రెండిటి నిర్మాత ఒకరే కావటం కొన్ని సమస్యలకు కారణమవుతుంది. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ప్రమోషన్స్ లో మైత్రి వారు జాగ్రత్త పడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి ‘పార్టీ లాంగ్’ లిరికల్ వీడియో రిలీజ్ చేసి మెగా ఫాన్స్ ని, బాలయ్య ‘వీర శివారెడ్డి’ నుంచి ఫస్ట్ సాంగ్ అనౌన్సమెంట్ ఇచ్చి బాలయ్య ఫాన్స్ ని సంతృప్తి పరచే ప్రయత్నాలు చేసారు.
ప్రస్తుతం ఈ రెండూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. డిఎస్పీ మ్యూజిక్ తో, వాయిస్ తో పార్టీ సాంగ్ మాస్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. మీరూ ఓ లుక్కెయ్యండి.