విష్ణుప్రియ అకౌంట్ లో అశ్లీల ఫోటోలు, వీడియోలు … నెలలో రెండోసారి హ్యాక్

Vishnupriya Bheemineni

Vishnupriya Bheemineni | విష్ణుప్రియ ఇండస్ట్రీ కి వచ్చి చాలాకాలం అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో ఓ అడుగు పెట్టినా అమ్మడు యాంకర్ గానే పాపులర్ అయింది. సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉంటూ, హాట్ హాట్ ఫొటోలతో ఫాలోయింగ్ పెంచుకుంది విష్ణుప్రియ. ప్రస్తుతం అమ్మడు షోస్ లేకపోవటం వలన పెద్దగా కనిపించటం లేదు.

ఆమధ్య సడెన్ గా ఓ బ్రాండ్ కి ప్రమోషన్ చేస్తూ టాప్ లెస్ గా కనిపించి షాకిచ్చింది. తాజాగా విష్ణుప్రియ పేస్ బుక్ అకౌంట్ లో అశ్లీల ఫోటోలు, వీడియోలు దర్శనమిచ్చి షాకిచ్చాయి. అయితే ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయిందని, సమాచారాన్ని అందరికీ చేరవేసి, పేజిని అన్ ఫాలో అవ్వమని ఇన్‌స్టాగ్రామ్‌ స్టొరీలో పోస్ట్ చేసింది విష్ణుప్రియ.

తాజాగా మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్ లో మరోసారి అశ్లీల ఫోటోలు వీడియోలు దర్శనమిస్తున్నాయి. నెల రోజుల్లో రెండో సారి అకౌంట్ హాక్ అయిందంటే ఆలోచించాల్సిన విషయమే…. సోషల్ మీడియా ఎవరికీ సేఫ్ కాదన్నమాట.

https://www.facebook.com/anchorvishnupriya