రాజసం ఆయన ఇంటి పేరు! … వీర సింహారెడ్డి ఫస్ట్ సింగల్ ‘జై బాలయ్య’ అనౌన్సమెంట్
VEERA SIMHA REDDY Jai Balayya Song

VEERA SIMHA REDDY Jai Balayya Song | టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బాలయ్యకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. హీరోగా, ప్రజా నాయకుడిగా, కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అధికారిక బాధ్యతలకు తోడు గుప్త దానాలు, సేవలు ఎన్నో చేస్తున్న బాలయ్యకు కోట్లలో అభిమానులుండటం సహజమే. గతేడాది ఓటిటి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షోతో అంతకు ముందున్న ఎంతోకొంత నెగటివ్ టాక్ ను చెరిపేసుకున్నాడు.
ఆ షో అప్పటి వరకు యాంటీ ఫాన్స్ లో, సాధారణ ప్రేక్షకుల్లో బాలయ్య పై ఉన్న థింకింగ్ ని మార్చేసింది. బహుశా ‘అఖండ’ అంత భారీ విజయం సాధించటానికి ఈ షో కూడా ఓ కారణమంటున్నారు సినీ జనాలు. ఇక అసలు విషయానికి వస్తే…
ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా దసరా టార్గెట్ అనుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వాళ్ళ లేట్ అవుతూ వస్తుంది. ఆ తరువాత అఖండ సెంటిమెంట్ తో డిసెంబర్ 2 ను టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నారు. అయితే అమెరికా వీసాల ప్రాబ్లెమ్ తో షూటింగ్ టర్కీ కి షిఫ్ట్ చేయటం, తదనంతర గిల్డ్ బంద్ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ను సంక్రాంతికి ఫిక్స్ చేసారు.
ఈమధ్యే కర్నూల్ కొండారెడ్డి బురుజు సాక్షిగా టైటిల్ అనౌన్స్ చేసిన మైత్రి మూవీ మేకర్స్, ప్రమోషన్స్ లో భాగంగా ఈనెల 25 న ఫస్ట్ సింగల్ ‘జై బాలయ్య’ విడుదల చేయనున్నారు. తాజాగా అధికారికంగా ఈ ప్రకటన వెలువడింది. మీరూ ఓ లుక్కెయ్యండి.
రాజసం ఆయన ఇంటి పేరు! 💥💥💥
Get Ready for the MASS ANTHEM for the GOD OF MASSES 🔥#VeeraSimhaReddy 1st single #JaiBalayya on November 25th @ 10.29 AM❤️🔥
‘Nata Simham’ #NandamuriBalakrishna @shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/IqQs0nC9DU
— Gopichandh Malineni (@megopichand) November 23, 2022