ఊర్వశివో రాక్షసివో క్లోజింగ్ కలెక్షన్స్ …. డబుల్ డిజాస్టర్

Urvasivo Rakshasivo collections

Urvasivo Rakshasivo collections |  రాజశేఖర్ అంకుశం సినిమా హిందీ లో చిరంజీవి హీరోగా ‘ప్రతిబంద్‘ టైటిల్ తో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో చిరంజీవి బాలీవుడ్ డెబ్యూ చేస్తే, బాల నటుడిగా అల్లు శిరీష్ తెరంగేట్రం చేసాడు. ఆ తరువాత 2013 లోనే ‘గౌరవం’ అనే ద్విభాషా చిత్రంతో టాలీవుడ్, కోలీవుడ్ లలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

అప్పటినుంచి పట్టు వదలని విక్రమార్కుడిలా తెలుగు ప్రేక్షకులపై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు అల్లు శిరీష్. ప్రస్తుతం ‘ఊర్వశివో రాక్షసీవో’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అమెరికెన్ మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయల్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే తెరంగేట్రం చేసింది. ఆ తరువాత ఐదేళ్లకి 2016 లో మలయాళంలో, తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్ను’ సినిమాతో అమ్మడు టాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. ఇప్పటికీ అమ్మడికి సరైన హిట్ అనేది లేదు.

ఈ డిజాస్టర్ హీరో హీరోయిన్లు ఎంతో ఆశ పెట్టుకున్న ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా నవంబర్ 4 న రిలీజ్ అయింది. ఫస్ట్ డే నే మంచి రివ్యూ లు, మౌత్ టాక్ తో వారాంతం సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. దీంతో అల్లు వారు ఆతృతగా సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా ఘనంగా నిర్వహించేసారు. కట్ చేస్తే ….

7 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఏడున్నర కోట్ల షేర్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగింది. ఏరియాలవారీగా సినిమా రాబట్టిన కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.Urvasivo Rakshasivo collections

నైజాం : 1.11Cr
సీడెడ్ : 35L
ఉత్తరాంధ్ర : 47L
ఈస్ట్ : 25L
వెస్ట్ : 15L
గుంటూరు : 23L
కృష్ణ : 27L
నెల్లూరు : 12L
ఏపీ+టిజి2.95CR(5.55CR Gross)
కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా+ఓవర్సీస్ – 40L
Total WW3.35CR(6.40CR Gross) 
అంటే ౭.౫ కోట్లు కలెక్ట్ చేయసిన సినిమా సగం కూడా కలెక్ట్ చేయలేదు. అంటే డబుల్ డిజాస్టర్ అయినట్టేగా… మెగా, అల్లు వారి లెక్కలో సినిమా హిట్ అయి ఉండవచ్చు. అయితే కమర్షియల్ గా మాత్రం సినిమా భారీ డిజాస్టరే.