నాగ చైతన్య ‘కస్టడీ’ ఫస్ట్ లుక్ … మాస్ లుక్ అదిరింది

Naga Chaitanya Custody first look

Naga Chaitanya Custody first look | అక్కినేని నాగ చైతన్య, మూడోతరం అక్కినేని వారసుడిగానే తెరంగేట్రం చేసినా, టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు నాగ చైతన్య. వాటిలో సోలో హీరోగా చేసిన ‘థాంక్యూ’ భారీ డిజాస్టర్ అయింది.

నాగార్జున తో కలిసి నటించిన బంగార్రాజు హిట్ టాక్ తెచ్చుకున్నా, కలెక్షన్ల పరంగా యావరేజ్ సినిమాగానే ముగిసింది. ఇక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘లాల్ సింగ్ చద్దా’ గురించి చెప్పాల్సిన పనే లేదు. మొదటి రోజే జనాల్లేక షోస్ కాన్సల్ అయ్యాయంటేనే అర్ధం చేసుకోవచ్చు అదెంత డిజాస్టర్ అనేది. ఇక అసలు విషయానికి వస్తే ….

ప్రస్తుతం నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య రెండోసారి కృతి శెట్టి తో జతకట్టాడు. అరవింద స్వామి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇళయ రాజా, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో 22 వ సినిమా కావటంతో #NC22 టైటిల్ తో ప్రారంభమైన ఈ సినిమాకు ఈరోజు టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు నిన్న ప్రకటించింది చిత్ర యూనిట్.
చెప్పినట్టు గానే టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసారు. నిజానికి నిన్న అనౌన్సమెంట్ పోస్టర్ తోనే సోషల్ మీడియాలో #NC22 బాగా ట్రెండ్ అయింది. కస్టడీ టైటిల్ తో విడుదల చేసిన నాగ చైతన్య ఫస్ట్ లుక్ ట్రాండ్ అవటం ఖాయంలా కనిపిస్తుంది. మీరూ ఓ లుక్కెయ్యండి.