ఈవారం థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమాలు

Movie releases this week 23112022

Movie releases this week 23112022 | ఈమధ్య కొంతమంది హీరోలు రీమేక్ లతో సేఫ్ గేమ్ ఆడుతుంటే, నిర్మాతలు డబ్బింగ్ వెర్షన్ లతో కాసులు దండుకుంటున్నారు. తాజాగా ఈనెల 4 న రిలీజ్ అయి హిట్ టాక్ దాచుకున్న ఓ తమిళ సినిమా ను దిల్ రాజు తెలుగులో 3 వారాల గ్యాప్ తో విడుదల చేయనున్నాడు. వివరాల్లోకి వెళితే ….ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’ ఈనెల 4 న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

లీడ్ యాక్టర్లు పెద్దగా క్రేజ్ ఉన్నవాళ్లు కాకపోయినా, రాధికా, సత్యరాజ్ లాంటి సీనియర్ నటీనటుల పాడింగ్ తో సినిమాకు క్రేజ్ వచ్చింది. ఈనెల 25 న తెలుగు వెర్షన్ థియేటర్స్ లో సందడి చేయనుంది. తమిళంలో హిట్ అవటంతో ఎంతోకొంత క్రేజ్ సంపాదించుకుంది ఈ సినిమా. ఈవారమే విడుదలవుతున్న మరో డబ్బింగ్ సినిమా ‘తోడేలు’. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా తెరకెక్కిన ‘భేడియా’ సినిమాను ‘తోడేలు పేరుతొ తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఈవారం టాలీవుడ్ సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అల్లరి నరేష్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రీసెంట్ గా ‘నాంది’ సినిమాతో చాలాకాలం తరువాత హిట్ అందుకున్నాడు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమానే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా కనిపించనున్నాడు. డబ్బింగ్ క్సినిమాలు తప్ప మరేదీ పోటీలో లేకపోవటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం.
పరశురాం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన రణస్థలి, మరో డబ్బింగ్ సినిమా ‘కొరా కాగజ్’ కూడా ఈవారమే విడుదలవుతున్నాయి.