మండే టెస్ట్ పాసైన మసూద … థ్రిల్లర్ కథాంశంతో మరో హిట్

Masooda Box office

Masooda Box office |  మంచి అభిరుచి గల నిర్మాత అయిన రాహుల్ యాదవ్ నక్కా, తన తాజా చిత్రం ‘మసూద’ తో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. గతంలో ఆయన నిర్మించిన ‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’  విజయం సాధించాయి. ఈ మూడు సినిమాలు గమనిస్తే రాహుల్ యాదవ్ నక్కా స్టార్ క్యాస్ట్ కి కాకుండా కథకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తుంది.

చిన్న సినిమాగా గతవారం విడుదలైన మసూద సినిమా కూడా కంటెంట్ ప్రధానమైనది. ఒక్క సంగీత ను మినహాయిస్తే మిగతా ఎవరూ కూడా తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలిసిన మొఖాలు కాదు. చిన్న సినిమాగా లిమిటెడ్ థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, రోజురోజుకి థియేటర్స్ పెంచుకుంటూ పోతుంది.

గతవారం సినిమాల్లో ఈ సినిమానే ఎంతోకొంత కలెక్షన్స్ సాధిస్తుంది. షో షో కి జనం పెరగటం చూస్తుంటే మౌత్ పబ్లిసిటీ బాగా వర్కౌట్ అయినట్టుంది. ఎప్పుడైనా సెల్లింగ్ కాన్సెప్ట్ థ్రిల్లర్. ఈ సినిమా కూడా థ్రిల్లర్ కావటం తో భయపడుతూనే జనం ఎంజాయ్ చేస్తున్నారు.

ఈమధ్య కాలంలో ఎంత టాక్ బాగున్నా, సినిమా మొదటి వారాంతం తరువాత డౌన్ అయిపోవటం కామన్ అయింది. మెగాస్టార్ సినిమానే మండే టెస్ట్ పాస్ అవలేకపోయింది. ప్రతి సినిమాకూ మొదటి సోమవారం పెద్ద గండం అయిపొయింది. అయితే మసూద మండే టెస్ట్ పాస్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ నమోదు చేసుకుంది. సోమవారం కూడా సినిమాకు అక్కడక్కడా హౌస్ ఫుల్స్ పడటం విశేషం.