బాలీవుడ్ కు ఊపిరందించిన దృశ్యం 2 … వీకెండ్ కలెక్షన్ల సునామి … పెరుగుతూ పోతున్న థియేటర్లు

Drishyam 2 hindi collections

Drishyam 2 hindi collections | కోవిడ్ తరువాత సినిమా ఇండస్ట్రీ కి భారీ దెబ్బ తగిలింది. జనం ఓటిటీ లకు అలవాటు పడటం, థియేటర్స్ లో ఇతరత్రా ఖర్చులు భారీగా పెరిగిపోవటం తో సినిమా ఇండస్ట్రీ కోలుకోలేని పరిస్థితికి వెళ్లిపోయింది. సౌత్ సినిమాలు ఎలాగోలా తేరుకున్నా, బాలీవుడ్ పరిస్థితి మాత్రం ఇంకా దారుణంగానే ఉంది.

ఈమధ్య బాలీవుడ్ లో మంచి టాక్ వచ్చిన సినిమా కూడా మొదటి వారాంతానికే చేతులెత్తేయడం కామనై పోయింది. రీమేక్ సినిమాలు నిజానికి సేఫ్ అని భావిస్తారు. అలాంటిది ఈమధ్య రీమేక్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లాపడటం చూస్తున్నాం.

తాజాగా మరో రీమేక్ సినిమా బాలీవుడ్ లో విడుదలైంది. అజయ్ దేవగన్, టబు, శ్రియ, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘దృశ్యం 2’ సినిమా ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మరీ ఓవర్ గా కాకుండా ఓ మోస్తరు థియేటర్స్లో డీసెంట్ రిలీజ్ చేసారు.

థ్రిల్లర్ కథాంశం కావటం, ట్రైలర్ గ్రిప్పింగ్ గా ఉండటం, మౌత్ టాక్ అన్ని వెరసి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మొదటి రోజు నుంచే థియేటర్స్ పెంచుకుంటూ పోయారు. నిన్న ఆదివారం థియేటర్స్ అన్ని చోట్లా ఫుల్ అవటం తో బాలీవుడ్ ఓ రేంజ్ లో ఊపిరి పీల్చుకుంది అని చెప్పవచ్చు.

ఏమీలేని చెత్త బాలీవుడ్ సినిమాలను జాకీ వేసి లేపుదామని ప్రయత్నించిన బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ లకు ఈ సినిమా ఉపశమనం కల్పించింది.