చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు…. స్పెల్లింగులు కూడా రాని మంత్రి ప్రశంస

Chiranjeevi named for the indian film personality of the year 2022 award

Chiranjeevi named for the indian film personality of the year 2022 award | మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం మరో అరుదైన గౌరవం అందించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది అందించే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2022 వ సంవత్సరానికి గానూ చిరంజీవికి అందించనున్నట్లు ప్రకటించారు.

భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013లో ఈ అవార్డును ప్రారంభించారు. .వహీదా రెహమాన్ ఈ అవార్డును మొదటిసారి అందుకోగా, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం, అమితాబ్ బచ్చన్, సలీం ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్ జోషి వంటి సినీ దిగ్గజాలకు ఆ తరువాత ఈ అవార్డు దక్కింది.

ఈ ఏడాది చిరంజీవికి ఈ అవార్డును అందించనున్నారు. నాలుగు దశాబ్దాల పైగా కొనసాగుతున్న కెరీర్‌లో 150కి పైగా చిత్రాల్లో నటించినందుకు చిరంజీవికి ఈ అవార్డు అందించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ….

ఆయనగారి ట్వీట్ లో మిగతా అంతా ఎలా ఉన్నా తెలుగు స్పెల్లింగ్ కూడా సరిగా లేకపోవటం గమనించాల్సిన అంశం.

Chiranjeevi named for the indian film personality of the year 2022 award 1
Chiranjeevi named for the indian film personality of the year 2022 award 1