షాకింగ్…రెండుసార్లు కాన్సర్ ను జయించి …24 ఏళ్ళ వయసులోనే గుండెపోటు తో మృతి చెందిన హీరోయిన్

Aindrila Sharma

Aindrila Sharma | ప్రముఖ బెంగాళి నటి ఐంద్రిలా శర్మ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో నవంబర్‌ 1న కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. రెండు వారాలుగా వెంటిలేటర్‌పైనే చికిత్స తీసుకుంటున్న ఆమెకు 15న గుండెపోటు వచ్చింది.

ఒకటి కంటే ఎక్కువ సార్లు గుండెపోటు రావడంతో వెంటిలేటర్ పైనే డాక్టర్లు ఆమెకు చికిత్స అందించారు. అయితే ఈరోజు పరిస్థితి విషమించి ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు..

గతంలో ఐంద్రిలా శర్మ రెండు సార్లు క్యాన్సర్‌ను జయించింది. బెంగాలీ సీరియళ్లు, సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆమె బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు.