రష్మికకు బాలీవుడ్ లో మరో షాక్ … మిషన్ మజ్ను డైరెక్ట్ ఓటిటీ లో

Rashmika Mandanna Mission Majnu

Rashmika Mandanna Mission Majnu |  కిరాక్ పార్టీ సినిమాతో కన్నడ భామ రష్మిక మందన్న తెరంగేట్రం చేసింది. అదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టి తో పెళ్ళికి కూడా రెడీ అయింది. ఇదంతా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వక ముందు. చలో సినిమాతో ఎప్పుడైతే టాలీవుడ్ లో అడుగుపెట్టిందో ఒక్కసారిగా రష్మిక ఫేట్ మారిపోయింది.

ఒక్కో సినిమాతో ఎదుగుతూ మహేష్ బాబు సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఇప్పుడు అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్ లలోనూ ఎంట్రీ కి రెడీ అవుతుంది. ఇప్పటికే పుష్ప తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ సినిమా ప్రమోషన్స్ లో అందాల ఆరబోతతో బాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయింది.

రష్మిక, అమితాబ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘గుడ్ బై’ సినిమా అక్టోబర్ 7 న విడుదల అయింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది రష్మిక. తీరా సినిమా రిలీజ్ అయ్యాక, అది కాస్తా భారీ డిజాస్టర్ అవ్వటంతో రష్మిక కు బాలీవుడ్ లో మొదటి షాక్ తగిలింది. అమ్మడి క్రేజ్ జనాన్ని థియేటర్స్ కి రప్పించలేకపోయింది.

నిజానికి మిషన్ మజ్ను నే రష్మిక బాలీవుడ్ డెబ్యూ మూవీ. ఈ సినిమా నిర్మాణం ఆలస్యం అవటంతో ‘గుడ్ బై’ ముందు రిలీజ్ అయింది. శంతను భాగ్ఛీ దర్శకత్వంలో తెరకెక్కిన మిషన్ మజ్ను ఒక స్పై థ్రిల్లర్. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ సినిమాను నెట్ ఫ్లిక్ భారీ ధరకు దక్కించుకుంది.
తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ ఓటిటీ రిలీజ్ స్ట్రీమ్ కానుంది. ఈమధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలన్నీ డిజాస్టర్లు అవుతుండటం, పైగా రొటీన్ కంటెంట్ కావటం తో థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తే నష్టపోతామని భావించిన నిర్మాతలు, నెట్ ఫ్లిక్స్ అఫర్ కు ఆకర్షితులయ్యారని తెలుస్తుంది.

ఏదైతేనేం, రష్మిక కు బాలీవుడ్ లో మరో గట్టి షాక్ తగిలినట్టే….ఈ సినిమా విడుదల తేదీ నెట్ ఫ్లిక్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.