ప్రకంపనలు రేపుతున్న అదాశర్మ ‘ది కేరళ స్టోరీ’ … పోలీస్ కేసు నమోదు … బ్యాన్ అయ్యే అవకాశం

The Kerala Story controversy

The Kerala Story controversy | వివాదాల మీద సినిమాలు తీస్తే త్వరగా ఆడియన్స్ ని కనెక్ట్ చేయచ్చనో మరో కారణమో కానీ ది కాశ్మీర్ ఫైల్స్ సక్సెస్ మరిన్ని వివాదాలు తెరకెక్కించేందుకు స్ఫూర్తినిస్తోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’, నిజానికి ఓ డాక్యుమెంటరీ తరహాలో ఉంటుంది.

అయినా ప్రేక్షకులకి బాగానే కనెక్ట్ అయి 300 కోట్లు రాబట్టింది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమోషన్ ఉందనేది కాదనలేం సత్యం. ముఖ్యంగా హిందుత్వ కాన్సెప్ట్ ఆ సినిమాకు కాసులు కురిపించింది. ఇప్పుడు ఇలాంటి వివాదాస్పద అంశం తోనే తో మరో సినిమా తెరకెక్కింది. వివరాల్లోకి వెళితే….

తాజాగా అదా శర్మ ముఖ్యపాత్రలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ టీజర్ తీవ్ర వివాదానికి కారణమైంది. కేరళకు చెందిన అమ్మాయిలు ఎంతో మంది అప్ఘనిస్తాన్ తో పాటు మరికొన్ని దేశాలకు నర్స్ లుగా సేవ చేసేందుకు వెళ్తున్నారు. ఆ సమయంలో అమ్మాయిలను ముస్లీంలు గా మార్చి అప్ఘనిస్తాన్ కి పంపిస్తున్నారు అంటూ టీజర్ లో అదా శర్మ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తాను అప్ఘనిస్తాన్ జైలులో ఒక టెర్రరిస్ట్ మాదిరిగా ఉన్నట్లుగా పేర్కొంది. ఆ వీడియో ప్రస్తుతం కేరళ లో తీవ్ర దుమారం కలిగిస్తుంది. మొత్తం 32 వేల మంది కేరళకు చెందిన అమ్మాయిలు సిరియా లాంటి దేశాల్లో భూస్థాపితమయ్యారని, సాదాసీదా అమ్మాయిలను టెర్రరిస్టులాగా తయారు చేసే గేమ్ కేరళలో నడుస్తుందని చెప్పుకొచ్చింది అదాశర్మ.
తప్పుడు లెక్కలు చెబుతూ కేరళ రాష్ట్ర, ప్రజల పరువు తీయడంతో పాటు, కేరళ అమ్మాయిల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి విజయన్ కి కొందరు ఫిర్యాదు చేయడం, అలాగే కేరళ డీజీపీ కి కూడా ఈ విషయమై ఫిర్యాదు చేయడం తో అదాశర్మ తోసహా చిత్ర యూనిట్ సభ్యులపై పోలీస్ కేసు చేసినట్లుగా కేరళ పోలీస్ లు పేర్కొన్నారు. ఇప్పటికే కేరళకు చెందిన నెటిజన్లు ఓ రేంజ్ లో అదాశర్మ ను ట్రోల్ చేస్తున్నారు.

కల్పిత కథే అయినప్పుడు రాష్టం పేరు వాడకుండా ఉండాల్సిందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా బ్యాన్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో…