ఎన్టీఆర్ సర్‌ ప్రైజ్‌ న్యూ లుక్ … ఫ్యాన్స్ ఖుష్

NTR New Look

NTR New Look | ఆర్ ఆర్ ఆర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఇంకా మొదలు కాలేదు. ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కొరటాల గత చిత్రం ‘ఆచార్య’ భారీ డిజాస్టర్ కావటంతో ఆ సెటిల్మెంట్ల రచ్చ ఇంకా తేలలేదని, తద్వారా ఎన్టీఆర్ సినిమా లేట్ అవుతుందని చాలాకాలం నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

అప్పట్లోనే కొరటాల జాన్వీ కపూర్ ను ఫైనల్ చేసాడని వార్తలొచ్చాయి. అవి కూడా నిజం కాలేదు. ఈనెల మూడోవారంలో సినిమా షూటింగ్ మొదలుకాబోతుంది అని కూడా ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎదో ఒక అఫీషియల్ అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్ న్యూ లుక్ నెట్లో వైరల్ అవుతుంది … దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మీరూ ఓ లుక్కెయ్యండి.