కొండారెడ్డి బురుజు సాక్షిగా ‘వీర సింహా రెడ్డి’ టైటిల్, సంక్రాంతి రిలీజ్ అనౌన్సమెంట్

VEERA SIMHA REDDY release date | టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బాలయ్యకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. హీరోగా, ప్రజా నాయకుడిగా, కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అధికారిక బాధ్యతలకు తోడు గుప్త దానాలు, సేవలు ఎన్నో చేస్తున్న బాలయ్యకు కోట్లలో అభిమానులుండటం సహజమే. గతేడాది ఓటిటి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షోతో అంతకు ముందున్న ఎంతోకొంత నెగటివ్ టాక్ ను చెరిపేసుకున్నాడు.

ఆ షో అప్పటి వరకు యాంటీ ఫాన్స్ లో, సాధారణ ప్రేక్షకుల్లో బాలయ్య పై ఉన్న థింకింగ్ ని మార్చేసింది. బహుశా ‘అఖండ’ అంత భారీ విజయం సాధించటానికి ఈ షో కూడా ఓ కారణమంటున్నారు సినీ జనాలు. ఇక అసలు విషయానికి వస్తే…

ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా దసరా టార్గెట్ అనుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వాళ్ళ లేట్ అవుతూ వస్తుంది. ఆ తరువాత అఖండ సెంటిమెంట్ తో డిసెంబర్ 2 ను టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నారు. అయితే అమెరికా వీసాల ప్రాబ్లెమ్ తో షూటింగ్ టర్కీ కి షిఫ్ట్ చేయటం, తదనంతర గిల్డ్ బంద్ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయనున్నారని సమాచారం.

తాజాగా కర్నూల్ కొండారెడ్డి బురుజు సాక్షిగా ‘వీర సింహా రెడ్డి’ అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు మైత్రి నిర్మాతలు. అలాగే అనౌన్సమెంట్ పోస్టర్ లోనే సంక్రాంతి రిలీజ్ అని అధికారిక ప్రకటన కూడా వెలువడటంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.