భార్య‌ల‌కు భ‌ర‌ణం ఇవ్వటమే జనసేనలో చేరటానికి అర్హతట … కోర్టు తీర్పుతో పేలుతున్న సెటైర్లు

Prudhvi Raj Janasena Party | పృథ్వీ రాజ్ అంటే బహుశా ఎవరికీ తెలియక పోవచ్చు. 30 ఇయర్స్ ఇండీస్ట్రీ అంటే ఎవరికైనా అర్ధమవుతుంది. ఈయన గారు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి ని పెళ్లి చేసుకున్న విషయం, ఆమె తనను భర్త వేధిస్తున్నాడని కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో ప్రిథ్వి రాజ్ స్వయంగా విడాకులు తీసుకుంటున్న విషయం మీడియా ద్వారా తెలియచేసాడు. పృథ్వీ రాజ్ నెలకు 30 లక్షలు షూటింగుల ద్వారా సంపాదిస్తున్నాడని, తనకు 10 లక్షలు భరణం ఇప్పించాలని కోర్టులో దావా వేసింది శ్రీ లక్ష్మి. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు పృథ్వీ రాజ్ శ్రీలక్ష్మి కి ప్రతి నెలా 8 లక్షలు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఆమె కేసు పెట్టిన 2017 నుంచి ఈ భరణం లెక్కకు వస్తుంది. ఈ తీర్చు అటు తిరిగి, తిరిగి పవన్ కళ్యాణ్ పై, జనసేన పై సెటైర్లకు కారణమైంది.

పృథ్వీ రాజ్ గత ఎన్నికల్లో వైసిపి తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అలాగే మనోడి నోటి దూల కారణంగా ఇండస్ట్రీ లో ఉన్న అవకాశాలు పోయాయి. మరో దూల కారణంగా వైసిపి ని వీడాల్సి వచ్చింది. కట్ చేస్తే… పృథ్వీ రాజ్ ఇప్పుడు అనసేన పార్టీ లో ఉన్నాడు. దీంతో ఈయన గారిపై వచ్చిన కోర్టు తీర్పు జనసేనపై ట్రోల్స్ కు కారణమైంది. ఆవు చేలో మేస్తే దూడ గ‌ట్టున మేస్తుందా… అంటూ పవన్ కళ్యాణ్ ని కూడా లాగి మరీ ట్రోల్ చేస్తున్నారు వైసిపి పార్టీ వారు. భార్య‌ల‌కు భ‌ర‌ణం చెల్లించ‌డ‌మే జనసేనలో చేరటానికి అర్హతా… అంటూ ఓ రేంజ్ లో సెటైర్లు పేలుతున్నాయి. వీటన్నిటికీ కారణం వైసిపి లో చేరినప్పుడు, వీడినప్పుడు ఈయన గారి నోటిదూల ప్రదర్శనే.

మరోపక్క జనసైనికులు సైతం, ఇతని వల్ల రూపాయి ఉపయోగం లేకపోగా, పార్టీ కి నష్టం జరుగుతుందని బాధపడుతున్నారట.

Prudhvi Raj Janasena Party
Prudhvi Raj Janasena Party