ఈసారి పోస్టర్లతోనే రచ్చ మొదలైందిగా

Prabhas Aadipurush teaser | రాజమౌళి బాహుబలితో రానా, ప్రభాస్ పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. ముఖ్యంగా ప్రభాస్ ఆ తరువాత అన్ని పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ సినిమాలే ఎంచుకుంటున్నాడు. బాహుబలి తరువాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ భారీ డిజాస్టర్ అయినా ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇవన్నీ ముందు తెలుగులో చేసి ఇతర భాషల్లో డబ్ చేసిన సినిమాలు. అయితే ప్రభాస్ తాజా ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ స్ట్రైట్ బాలీవుడ్ చిత్రం. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన విషయం తెలిసిందే. ఈరోజు టీజర్ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఓ పోస్టర్ ద్వారా తెలియచేసారు. ఆ పోస్టర్ లో రాముడిగా ప్రభాస్ కనిపించాడు. ఇక అసలు విషయానికి వస్తే…

తమ హీరో మిగిలిన హీరోకన్నా గొప్ప అనుకోవటం అందరు హీరోల ఫాన్స్ కు సహజమే. అయితే తమ హీరో తప్ప మిగిలినవాళ్లు ఎవరూ హీరోలే కాదు అనుకునే ఏకైక ఫాన్స్ మెగా ఫాన్స్. అందుకే ఏ హీరో అప్డేట్ వచ్చినా ట్రోల్ చేయటం వీళ్ళకి బాగా అలవాటు. ఇప్పుడు విడుదలైన ప్రభాస్ పోస్టర్ ను, ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ పోస్టర్ ను పక్క పక్కన పెట్టి కంపేర్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. మరి రాముడికి, అల్లూరి కి పోలిక ఏంటో? వారికే తెలియాలి. కాదేది ట్రోల్స్ కి అనర్హం అంటే ఇదేనేమో?