థండర్ థైషో తో షాకిచ్చిన బింబిసార హీరోయిన్ (ఫొటోలతో)

Catherine Tresa Alexander | దుబాయ్ పాప క్యాథెరిన్ ట్రెసా తెరంగేట్రం చేసి 12 ఏళ్ళు దాటుతుంది. 2010 లో శంకర్ ఐపీఎస్ సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన క్యాథెరిన్, ఆ వెంటనే మాతృబాష మలయాళంలోనూ ఎంటర్ అయింది. తరువాత రెండేళ్లకే ‘చమ్మక్ చల్లో’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2016 లో వచ్చిన అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమాలో ఎమ్మెల్యే గా అమ్మడికి బాగా గుర్తింపు వచ్చింది. అయితే ఎందుకనో స్టార్ స్టేటస్ మాత్రం క్యాథెరిన్ ఎక్కడా సంపాదించలేకపోయింది. ఈమధ్యే అమ్మడికి ‘బింబిసార‘ రూపంలో భారీ హిట్ చేజిక్కింది. చూద్దాం ఇకనైనా అమ్మడి కెరీర్ ఊపందుకుంటుందేమో?…. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండే క్యాథెరిన్ ట్రెసా ఈమధ్య డోస్ పెంచి మరీ అందాలు ఆరబోస్తుంది. అమ్మడి తాజా ఫోటోలు కొన్నింటిపై మీరూ ఓ లుక్కెయ్యండి.