వైసిపి ఎంపీ గా పోటీ చేయట్లేదట …. నిజమా? సినిమా కోసమా?

Akkineni Nagarjuna | నాగార్జున ‘ది ఘోస్ట్’, చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఒకేరోజు విడుదలవుతుండటం సినీ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయితే ఎంతోకొంత కలెక్షన్స్ లో తేడా కొట్టటం ఖాయం. పైగా నాగార్జున, చిరంజీవి మంచి స్నేహితులు కూడా కావటంతో వీరిద్దరూ పోటీ పడటంలో మరేదో కారణముంది అనే గుసగుసలు ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, రెండు సినిమాల్లోనూ సిస్టర్ సెంటిమెంట్ కామన్ పాయింట్ అని, అందుకే వేరే ఆప్షన్ లేక ఒకే రోజు విడుదలకు సిద్ధమయ్యారని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. నాగ్, చిరు ఇద్దరూ కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగానే శుక్రవారం ‘ది ఘోస్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు నాగార్జున సమాధానం ఇచ్చారు. గత కొంతకాలంగా విజయవాడ నుంచి వైసిపి తరపున ఎంపీ గా నాగార్జున పోటీ చేయనున్నారనే వార్త బాగా చక్కర్లు కొడుతోంది. ఈ మీడియా ఇంటరాక్షన్ లో నాగార్జున ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ..ఇవన్నీ ర్యూమర్ల్ అని, చాలా కాలం నుంచి వినిపిస్తున్నవే అని, తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని … వివరణ ఇచ్చారు. అయితే సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది కనుక ఈ రియాక్షన్ అనీ, ఎంపీ గా పోటీ చేయటం ఖాయమే అని ఓ వర్గం భావిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో?