మీద పడ్డ ఫ్యాన్స్ పై చేయి చేసుకున్న హీరోయిన్ (వీడియోతో)

Saniya Iyappan | ఈమధ్య సినిమా ప్రమోషన్స్ కోసం సినీ తారలు డైరెక్ట్ గా జనాల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్స్ చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా జరిగిన ఒక సంఘటన నెట్లో హాట్ టాపిక్ అయింది. ప్రముఖ మల్లు హీరోయిన్ సానియా అయ్యప్పన్ తన సినిమా ప్రమోషన్స్ కోసం కాళికట్ లోని హై లైట్ మాల్ కు వెళ్ళింది. అమ్మడు మోహన్ లాల్ లూసిఫార్ లో కూడా కనిపించటంతో బాగా పాపులర్ అయింది. ఈవెంట్ నుంచి వెళ్లిపోయే టైములో ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు. సానియా కూడా సహనం కోల్పోయి చేయి చేసుకునే వరకు వెళ్ళింది. నెట్లో వైరల్ అవుతున్న ఆ వీడియో మీరూ చూడండి.