ఎంటర్టైన్మెంట్ నీకు తినే ఫుడ్ లో ఉందేమో …. నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫూల్ … అన్ స్టాపబుల్ 2 అఫీషియల్ …

Unstoppable with NBK season 2 official Anthem | బాలయ్య నాలుగు దశాబ్దాల కెరీర్ లో ఎప్పుడూ బుల్లితెర వైపు గాని, టీవీ ప్రకటనల వైపు గాని చూసింది లేదు. అలాంటిది సడెన్ గా ఆహా ఓటిటి లో ఓ టాక్ షో కు బాలయ్య ఓకే చెప్పటం, గతేడాది నవంబర్ 4 నుంచి దీపావళి శుభాకాంక్షలతో ‘అన్ స్టాపబుల్‘ టాక్ షో ఆహాలో స్ట్రీమ్ అవటం జరిగిపోయాయి. బాలయ్య టాక్ షో అనగానే చాలామంది అనేక సందేహాలు లేవదీశారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ మొదటి ఎపిసోడ్ తోనే బాలయ్య సంచలనం సృష్టించాడు. ఈ టాక్ షో ఆహా ను కూడా ఓ రేంజ్ కి తీసుకెళ్లింది అంటే అతిశయోక్తి కాదేమో. గతేడాది డిసెంబర్ 2 న విడుదలై సంచలనం సృష్టించిన ‘అఖండ‘ ఘనవిజయాన్ని ఈ టాక్ షో కూడా కారణమే.

ఈ టాక్ షో సీజన్ 2 కోసం ఫ్యాన్స్ తోసహా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈపాటికే మొదలు కావాల్సిన సీజన్ 2, NBK 107 షూటింగ్ లేట్ కారణంగా ఇంకా మొదలుకాలేదు. ‘అన్ స్టాపబుల్ 2’ త్వరలో ప్రారంభం కాబోతోందని ఈమధ్యే అధికారికంగా ప్రకటించారు. ఈసారి బాలయ్య షోకి మొదటి గెస్ట్ గా చిరంజీవి రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదు.

ఈరోజు ఉదయం అన్ స్టాపబుల్ అఫీషియల్ ప్రోమో 4 పీఎం కి విడుదల చేస్తామని ప్రకటన అధికారికంగా వెలువడింది. అన్నట్లుగానే కొంచెం ఆలస్యంగా ఆ ప్రోమో విడుదలైంది. రోల్ రైడా ర్యాప్ తో, మహతి స్వర సాగర్ ట్యూన్ తో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ ప్రమోషనల్ సాంగ్ బాలయ్య ఫ్యాన్స్ లో పూనకాలు సృష్టించటం ఖాయంగా కనిపిస్తుంది. మీరూ ఓ లుక్కెయ్యండి.