జి 5 లో కార్తికేయ 2

Karthikeya 2 OTT | చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన తాజా చిత్రం కార్తికేయ 2. హిట్ సినిమా రీమేక్ కనుక సహజంగానే కొంత క్రేజ్ ఉంటుంది.  బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ ప్రధాన పాత్రలో కనిపించటం అదనపు ఆకర్షణ. ఈ సినిమా మరీ భారీగా కాకపోయినా సినిమా డీసెంట్ బిజినెస్ చేసింది. చిన్న సినిమాగానే బాలీవుడ్ లోనూ విడుదలైన కార్తికేయ 2 ఏకంగా 130 కోట్లు కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా అక్టోబర్ 5 నుంచి జీ 5 లో స్ట్రీమ్ కానుంది. అదేరోజు థియేటర్స్ లో చిరంజీవి, నాగార్జున సినిమాలు విడుదలవుతుండటం విశేషం.