విక్రమ్ గాంధీ ఘోస్ట్ ఎలా అయ్యాడు? పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ?

Nagarjuna The Ghost preview | నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాజల్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసి ఒక షెడ్యూల్ షూట్ కూడా చేసారు. అయితే వ్యక్తిగత కారణాల వలన కాజల్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో మలయాళ బ్యూటీ అమలాపాల్, మెహరీన్ లలో ఒకరికి అవకాశం ఇద్దామనుకున్నారు. అయితే వారు కోటి పైనే డిమాండ్ చేయటంతో సోనాల్ చౌహన్ ను ఫైనల్ చేసారు. టైటిల్ విషయంలోనూ చాలా మార్పులే జరిగాయి. మొదటగా టైటిల్ ‘ది ఘోస్ట్’ అనే అనుకున్నా, కమల హాసన్, లోకేష్ కనకరాజ్ మొదటి పోస్టర్ లో ‘వన్స్ అపాన్ ఏ టైం దేర్ లివ్డ్ ఏ ఘోస్ట్’ అనే కాప్షన్ ఉండటంతో టైటిల్ క్లాష్ ఎందుకని మార్చాలనుకున్నారు. అప్పుడు నాగార్జున సినిమాకు ‘విక్రమ్ గాంధీ’ టైటిల్ ఫిక్స్ చేసారు. అయితే ఎక్కడా అనౌన్స్ చేయలేదు.

ఈలోపు కమల్ హాసన్ సినిమా కు ‘విక్రమ్’ టైటిల్ ఫిక్స్ అవటంతో ‘ది ఘోస్ట్’ టైటిల్ తమకు దక్కిందని తాజా ఇంటర్వ్యూ లో ప్రవీణ్ సత్తారు తెలియచేసారు. ఇదే గందరగోళం సినిమా రిలీజ్ విషయంలోనూ జరిగింది. ముందుగా ఈ సినిమా ఓటిటీ డైరెక్ట్ రిలీజ్ అంటూ ర్యూమర్లు వచ్చాయి. ఇప్పుడు సినిమా థియేట్రికల్ రిలీజ్ ఫైనల్ అయిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు ఈ సినిమా హిందీలోనూ రిలీజ్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమా హిందీలో రిలీజ్ చేసిన గోల్డ్ మైన్స్ సంస్థ ఈ విషయంలో పోటీ పడుతుంది. దాదాపు హిందీ రిలీజ్ ఖాయమయినట్టే. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.