మెగాస్టార్ గాడ్ ఫాదర్ సెన్సార్ టాక్

Chiranjeevi Godfather Censor talk | మలయాళంలో స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లూసీఫర్ సినిమాను తెలుగు లో చిరంజీవి ప్రథాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని లూసీఫర్ లో మార్పులు చేసి స్క్రిప్ట్ ను రెడీ చేశారు. పరుచూరి బ్రదర్స్ మొదలుకుని పలువురు యంగ్ రైటర్ లు ఈ స్క్రిప్ట్ వర్క్ లో సహకారాన్ని అందించారు. గాడ్ ఫాదర్ టైటిల్ తో తెరకెక్కిన ఈ రీమేక్ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. దీంతో ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్. అయితే చిరు గత చిత్రం ‘ఆచార్య’ భారీ డిజాస్టర్ అవటం వల్లనో, లేక మరే ఇతర కారణమో కానీ సినిమాకు మాత్రం బజ్ రాలేదనే చెప్పాలి.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ గాడ్ ఫాదర్ కు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ సభ్యులంతా సినిమాను మెచ్చుకున్నట్టు దర్సుకుడు మోహన్ రాజా ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. సెన్సార్ పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ మెగా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకర్షిస్తుంది. అలాగే చిరు స్వయంగా ప్రమోషన్స్ స్పీడ్ పెంచటంతో సినిమా కు ఈ పదిరోజుల్లో కావాల్సినంత బజ్ ఖచ్చితంగా వస్తుంది. అయితే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో నటించినా ఎందుకో హిందీలో మాత్రం ఈ సినిమాకు క్రేజ్ లేకపోవటం కొసమెరుపు. ఈ పది రోజుల్లో సల్మాన్ తో ప్రమోషన్స్ జోరు పెంచితే తప్ప అక్కడ ఓపెనింగ్స్ కష్టమే.