నాగార్జున స్పీడ్ మాములుగా లేదుగా … బంగార్రాజు ఫస్ట్ లిరికల్ టీజర్

Bangarraju laddundaa Lyrical video teaser | నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ 2016. సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించింది. ఇన్నేళ్ల తరువాత ఆ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కనున్న ఈ సినిమా కు కల్యాణ కృష్ణ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఓ పక్కన ఇప్పటికే సంక్రాంతి బెర్త్ బుక్ చేసుకున్న సినిమాలు వాయిదా పడుతుంటే కొత్తగా నాగార్జున బంగార్రాజు జనవరి 12 కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ మొదలు పెట్టారు నాగార్జున బంగార్రాజు టీమ్. ఈనెల 9 న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు బంగార్రాజు ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు టీజర్ కూడా విడుదల చేసారు.