విడాకులకు కారణం శిల్పాశెట్టి కాదు …. అక్రమ సంబంధమే అన్న రాజ్ కుంద్రా

Raj Kundra Shilpa Shetty
Raj Kundra Shilpa Shetty

Raj Kundra Shilpa Shetty | రాజ్ కుంద్రా మాజీ భార్య కవిత విడాకులకు కారణం శిల్ప శెట్టి అంటూ ఆరోపించిన పాత వీడియో మరోసారి వైరల్ అయింది. ఈ వార్తలు మీడియాలోనూ ప్రసారం కావటంతో 12 ఏళ్ళ తరువాత ఆ వీడియోపై స్పష్టత ఇచ్చాడు రాజ్ కుంద్రా. పింక్ విల్లా వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తమ విడాకులకు కారణం శిల్ప శెట్టి కాదని, తన మాజీ భార్య కవిత అక్రమ సంబంధమే అని స్పష్టం చేసాడు.

తాము విడాకులు 2006 లో తీసున్నామని, శిల్ప శెట్టి తో వివాహం 2009 లో జరిగిందని తెలియచేసాడు. ఆ వీడియో కూడా 11 ఏళ్ళ క్రితం వీడియో అని, పదేపదే అది బయటికి వచ్చి తమను ఇబ్బంది పెడుతుందని అందుకే ఇన్నేళ్ల తరువాత తప్పనిసరి పరిస్థితులలో తన మాజీ భార్య కవిత అసలు రూపం బయట పెడుతున్నట్లు వివరణ ఇచ్చాడు రాజ్ కుంద్రా. రాజ్ కుంద్రా చెల్లెలి భర్త తోనే కవిత కు అక్రమ సంబంధం ఉండేదని, అప్పట్లో లండన్ లో కలిసే వుండేవాళ్ళని , ఈ అక్రమ సంబంధం గురించి తెలిసాక తమ చెల్లిని ఆమె భర్తని ఇండియా పంపేశామని, అయినా కవిత అతనితో సంబంధం కొనసాగించటం వల్లే విడాకులు తీసుకోవలసి వచ్చిందని వివరణ ఇచ్చాడు.

Raj Kundra Shilpa Shetty
Raj Kundra Shilpa Shetty