ఒకే సంవత్సరంలో ఆరు బ్లాక్ బస్టర్లు సాధించిన ఏకైక హీరో బాలయ్య

Nandamuri Balakrishna 1986 record
Nandamuri Balakrishna 1986 record

Nandamuri Balakrishna 1986 record | నందమూరి బాలకృష్ణ ఈరోజు 61 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అందులో దాదాపు 47 ఏళ్ళు టాలీవుడ్ లోనే గడిపారు బాలయ్య. ఇన్నేళ్ళలో 1986 నుంచి 2003 వరకు ఇండస్ట్రీ లో బాలయ్య హవా నడిచింది. ఆ తరువాత కొంత హవా తగ్గినా సరైన సినిమాలు (సింహ, లెజెండ్) పడితే బాలయ్య స్టామినా కనపడుతుంది.

ముఖ్యంగా 1986 లో ఆరు బ్లాక్ బస్టర్ లు సాధించాడు బాలయ్య. ఆ ఫీట్ సాధించటం పక్కన పెడితే ఇప్పుడు అన్ని సినిమాలు చేసే హీరోలు కూడా కనపడరు. అపూర్వ సహోదరులు, సీతారామకళ్యాణం, ముద్దుల క్రిష్నయ్య, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు 1986 లో సూపర్ హిట్ అయ్యాయి. అప్పటినుంచి 2003 వరకు కూడా ప్రతి సంవత్సరం మినిమం ఒక బ్లాక్ బస్టర్ తో బాలయ్య టాలీవుడ్ ని శాసించాడు.

1987 లో మువ్వ గోపాలుడు, 1988 లో రాముడు భీముడు, 1989 లో ముద్దుల మామయ్య, 1990 లో నారి నారి నడుమ మురారి, 1991 లో తల్లిదండ్రులు & ఆదిత్య 369 , 1992 లో రౌడీ ఇనస్పెక్టర్, 1993 లో బంగారు బుల్లోడు, 1994 లో బొబ్బిలి సింహం. ఈ ఆరేళ్ళు బాలయ్య ఫాన్స్ కు గోల్డెన్ ఎరా. ఇలా కనీసం ఒక హిట్ తో బాలయ్య 2003 వరకు కొనసాగినా, ఆతరువాత ప్లాపులు ఎక్కువయ్యాయి.

యువ హీరోలు టాలీవుడ్ పై దండెత్తుతున్న, రీసెంట్ గా అఖండ టీజర్ తో అందరిని వెనక్కి నెట్టేశాడు బాలయ్య. ఇక సేవా కార్యక్రమాల్లో అందరికన్నా ముందుండే బాలయ్య మనసు వెన్న అని తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. అందుకే అయినా వాళ్ళు బాలయ్య అంటారు, కానివారు బాలకృష్ణ అంటారు, వీరాభిమానులు మాత్రం జై బాలయ్య అంటారు.

మరిన్ని ఎక్సక్లూసివ్ వార్తలు , గుసగుసలు , గ్యాలరీస్ కోసం మనసినిమా ను ఫాలో అవ్వండి .