మోక్షజ్ఞ ఎంట్రీ కి రంగం సిద్ధం , పుట్టినరోజున సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ చేసిన బాలయ్య

Balakrishna son mokshagna entry
Balakrishna son mokshagna entry

బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి రెడీ అవ్వండి. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న జూనియర్ బాలయ్య ఎంట్రీకి రంగం సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ 61వ బర్త్ డే సందర్భంగా మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం గురించి బాలయ్య ఆసక్తికర విషయాలు చెప్పారు .

మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనేది గత కొనేళ్లుగా జనాల్లో హాట్ ఇష్యూ అయింది. ఇప్పుడు.. అప్పుడు.. అంటున్నారే తప్ప ఈ నందమూరి వారసుడు మాత్రం కెమెరా ముందుకు రాలేదు. అయితే తాజాగా ఈ అంశంపై రియాక్ట్ అవుతూ నందమూరి అభిమానులు పండగ చేసుకునే విషయం చెప్పారు బాలకృష్ణ.

ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఆదిత్య 369 సీక్వెల్ సినిమాకి తాను కానీ లేదా సింగీతం శ్రీనివాసరావు కానీ దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తనకు ఎలా అయితే తన తండ్రి తాతమ్మకల అనే సినిమాలో మొదట తనకు అవకాశం ఇచ్చి ఎలా మెళుకువలు నేర్పించారో తాను కూడా తన కొడుకుకు ఈ మొదటి సినిమా తో అలాంటి మెళుకువలు నేర్పిస్తానని ఆయన చెప్పుకొచ్చారు .మొత్తం మీద బాలకృష్ణ చెప్పిన శుభవార్త ఫ్యాన్స్ కి మాత్రం ఒక పండగ లాంటిదే అని చెప్పవచ్చు.

Balakrishna son mokshagna entry తో ఎన్ని రికార్డులు తిరగరాస్తాడో వేచి చూడాలి.

 

మరిన్ని ఎక్సక్లూసివ్ వార్తలు , గుసగుసలు , గ్యాలరీస్ కోసం మనసినిమా ను ఫాలో అవ్వండి .