సమంత పాత్ర చనిపోవటంతో ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ బాబు?

Mahesh babu samantha the family man 3
Mahesh babu samantha the family man 3

Mahesh babu samantha the family man 3 | ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో మొదటి సీజన్ లో సందీప్ కిషన్, రెండవ సీజన్ లో సమంత వెబ్ సిరీస్ ఎంట్రీ ఇచ్చారు. సందీప్ కిషన్ కు ఎలాగూ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. అయినా సౌత్ నుంచి ఒక హీరో అనే లెక్క సరిపోయింది. అయితే రెండో సీజన్ స్లో నేరేషన్ తో చికాకు పుట్టించినా సమంత బోల్డ్ యాక్టింగ్ తో ఫ్యామిలీ మ్యాన్ 2 సూపర్ హిట్ అయింది.

దీంతో మూడో సీజన్ లోనూ అదే మేజిక్ రిపీట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు రాజ్ డీకే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, సౌత్ నుంచి ఓ సూపర్ స్టార్ ఫ్యామిలీ మ్యాన్ 3.లో ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. అయితే ఆ సూపర్ స్టార్ మరెవరో కాదు మహేష్ బాబు అని సోషల్ మీడియా తేల్చేసింది. కేవలం 15 రోజుల డేట్స్, మూవీ కి ఇచ్చే దాంట్లో సగం రెమ్యునరేషన్ అఫర్ చేసి మహేష్ ని ఒప్పించారని టాక్ నడుస్తోంది. అయితే బాలీవుడ్ లో సినిమా కూడా చెయ్యటానికి ఇష్టపడని మహేష్ బాబు వెబ్ సిరీస్ ఒప్పుకుంటాడా అనేది టాలీవుడ్ జనల డౌట్.