చిరంజీవి ని వెనక్కి నెడుతున్న బాలయ్య ?

Chiranjeevi Balayya Babu
Chiranjeevi Balayya Babu

Chiranjeevi Balayya Babu| మెగాస్టార్ చిరంజీవి , బాలయ్య బాబు ఈ ఇద్దరు సీనియర్ హీరోలకు ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు .. ముఖ్యంగా మాస్ లో ఇద్దరికీ విపరీతమైన క్రేజ్ .గత కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరు తమ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చినా చిరంజీవి తన ఆధిపత్యాన్ని చూపించాడు .

ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహా రెడ్డి చిత్రాలతో జోరు మీదన్న చిరు తన రాబోయే చిత్రాలు సీనియర్ డైరెక్టర్స్ కొరటాల , జయం మోహన్ రాజా వంటి దర్శకులతో చేస్తుంటే చేస్తుంటే బాలయ్య మాత్రం యువ దర్శకులు గోపీచంద్ మలినేని , అనిల్ రావిపూడి వంటి వారితో చేస్తున్నాడు . వరుస ప్లాపులతో సతమవుతున్న బాలయ్య బోయపాటి తో చేస్తున్న అఖండ తో భారీ విజయం నమోదు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నాడు .

ఆ ఇద్దరు దర్శకులే కాక బాలయ్య కోసం మరికొంత మంది యువ దర్శకులు కూడా లైన్ లో ఉన్నట్టు వినికిడి …ఇక బాలయ్య ఈ లైనప్ చూస్తుంటే కచ్చితంగా చిరును వెనక్కి నెట్టడం ఖాయం అనే అనిపిస్తుంది . మరో వైపు చిరు కూడా ఆచార్య తో బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడానికి సిద్ధమవుతున్నాడు.

మరిన్ని ఎక్సక్లూసివ్ వార్తలు , గుసగుసలు , గ్యాలరీస్ కోసం మనసినిమా ను ఫాలో అవ్వండి .