సుష్మిత సేన్ బ్రేఆప్ నిజమేనా

Sushmita sen breakup
Sushmita sen breakup

Sushmita sen breakup | మాజీ విశ్వ సుందరి సుష్మితాసేన్ పెళ్లికాకుండానే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని తల్లయింది. గతంలో పెళ్లి ఊసెత్తని సుష్మిత కొంతకాలం నుంచి తనకన్నా చిన్నవాడైన రోహ్మాన్ షాల్ తో ప్రేమలో పడింది. ఒకరిపై ఒకరు ప్రేమను సోషల్ మీడియా వేదికగా బాగానే కురిపించారు. కట్ చేస్తే

కొంతకాలం నుంచి వీరిద్దరూ బ్రేకప్ అయ్యారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు గొడుతుంది. దీనికి ఊతమిస్తూ రెండునెలల క్రితం 45 ఏళ్ళ వయసులో తప్పు చేశానంటూ సుష్మిత ఎమోషనల్ పోస్ట్ పెట్టటంతో దాదాపు బ్రేకప్ కంఫర్మ్ అనుకున్నారంతా. తాజాగా రోహ్మాన్ షాల్ ‘సుష్మిత ఓ అద్భుతం అని, ఆమెవల్లే తనకు స్టార్ స్టేటస్ వచ్చిందని’ ఫాలోయర్స్ తో చాట్ లో చెప్పటం, అయోమయానికి గురి చేస్తుంది. బహుశా సోషల్ మీడియా వీరిద్దరికి బ్రేకప్ చెప్పినా, వారింకా చెప్పుకోలేదేమో అని గుసగుసలు ముంబై లో వినిపిస్తున్నాయి.