స్టార్ కిడ్ సినిమాలో ప్రియా వారియర్ కు ఛాన్స్ … ఈసారైనా సక్సెస్ అవుతుందా

Priya varrier dhruv vikram
Priya varrier dhruv vikram

Priya varrier dhruv vikram | ఒక్క కన్నుగీటతో దేశాన్ని పడేసిన ప్రియా వారియర్ ఒక ఏడాది దాదాపు గా ఇండియన్ క్వీన్ లా ఫీల్ అయింది. అప్పట్లోనే అమ్మడి పొగరు కూడా బాగానే ఫేమస్ అయితే. ఇక అమ్మడి మొదటి సినిమా విడుదలై, అసలు యాక్టింగ్ కి పనికిరాదని తేల్చేసింది. ఆ సినిమా విడుదలకు ముందు మంచి మంచి అవకాశాలను కాలితో తన్నిన ప్రియా వారియర్ అడపాదడపా సినిమాలతో బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది.

నితిన్ చెక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రియా వారియర్. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇక రెండో సినిమా ఇష్క్ కరోనా కారణం గా వాయిదాపడింది. తాజాగా అందుతున్న వార్తలను బట్టి అమ్మడికి కోలీవుడ్ లో మంచి అవకాశం దొరికింది. ధృవ్ విక్రమ్ కొత్త సినిమాలో ప్రియా వారియర్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. చూద్దాం ఈ సినిమాతో అయినా సక్సెస్ బాట పడుతుందేమో.