జనం రిజెక్ట్ చేశాకే దిగొస్తున్నాడట

Kamal Haasan Indian 2
Kamal Haasan Indian 2

kamal hassan indian 2 | చాలామంది స్టార్ హీరోలు తమకు జనాదరణ వుంది అనుకోవటం సహజమే. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, విజయ్ కాంత్, శరత్ కుమార్ లాంటి వారు చలామణి అలా ఫీల్ అయి రాజకీయాల్లోకి వచ్చి పరువు పోగొట్టుకున్నారు. ఆకర్షణ వేరు, జనాదరణ వేరు. ఎక్కడో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వారు జనాదరణతి సీఎం లయ్యారు. తనకు అంట సీన్ ఉందని అనుకుని తాజాగా కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికల్లో 140 కి పైగా స్థానాల్లో పోటీ చేసి, అన్ని చోట్ల ఓడిపోయి రికార్డు సృష్టించాడు. దీంతో మరోసారి సినిమాలపై ద్రుష్టి సారించాడు కమల్.

180 కోట్లు ఖర్చు పెట్టేసిన ఇండియన్ 2 అర్ధాంతరం గా ఆగిపోనంటే చోద్యం చుసిన కమల్ ఇప్పుడు లైకా ప్రొడక్షన్ కు, డైరెక్టర్ శంకర్ కు రాజీ కుదిర్చి సినిమా పూర్తి చేయాలనీ ప్రయత్నిస్తున్నాడు. నిజానికి అసలు ఈ సినిమా ఆగిపోటానికి ముఖ్య కారణం కమల్ హాసన్ అనేది ఓపెన్ సీక్రెట్. చెప్పకుండా బిగ్ బాస్ కి వెళిపోవటమూ, విక్రమ్ అనే సినిమా మొదలు పెట్టటమూ, అలాగే తన పార్టీ పనులు వెరసి ఇండియన్ 2 సినిమాకు, నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పుడు రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయో, డబ్బులు పొతే పోయాయి శంకర్ తో మాకు సినిమా వద్దు అని నిర్మాతలు అంటారో చూడాలి.