ఎంఎస్ రాజు 7 డేస్ 6 నైట్స్ … డర్టీ హరి ని మించి ఉంటుందట

Dirty Hari Friday Movies
Dirty Hari Friday Movies

7 days 6 nights | ఒకప్పుడు మంచి ఫామిలీ సినిమాల నిర్మాత అయిన ఎంఎస్ రాజు దర్శకత్వంలో ఈ మధ్యనే ఒక బి గ్రేడ్ సినిమా ‘డర్టీ హరి’ వచ్చి ఓ మోస్తరు సక్సెస్ అయింది. నిజానికి ఇది థ్రిల్లర్ సినిమా అయినా సెక్స్ సినిమా గ ఎలివేట్ చేసి కొంత సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈరోజు ఎంఎస్ రాజు బర్త్ డే సందర్భం గా నిన్న మరో కొత్త సినిమా అనౌన్స్ అయింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎంఎస్ రాజు దర్శకత్వంలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై `7 డేస్ 6 నైట్స్’ అనే సినిమా తెరకెక్కనుంది. హైదరాబాద్ గోవా మంగుళూరు లతోపాటు అండమాన్ లోనూ ఈ చిత్రాన్ని షూట్ చేయనున్నారట. ఆ టైటిల్ ని బట్టే సినిమా ఎలాంటిదైనా పుబ్లిచిత్య్ మాత్రం డర్టీ ని మించే వుండచ్చేమో..