ఐకాన్ అల్లు అర్జున్ తోనే – దిల్ రాజు

Allu Arjun Icon
Allu Arjun Icon

Allu Arjun Icon – అల్లు అర్జున్ ఐకాన్ చిత్రం పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది , ఐకాన్ చిత్రం అనౌన్స్ చేసిన దగ్గరనుండి ఎన్నో అనుమానాలు ఉన్నాయి వాటన్నిటికీ నిర్మాత దిల్ రాజు ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చారు.

వకీల్ సాబ్ సూపర్ హిట్ అయిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన నిర్మాత , ఐకాన్ గురించి అడగగా బన్నీ కి ఐకాన్ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది , బౌండ్ స్క్రిప్ట్ కూడా రెడీ గా ఉంది , త్వరలోనే ఐకాన్ గురించి అధికారిక ప్రకటన చేస్తాం, షూటింగ్ కూడా త్వరలోనే మొదలు పెడతాం అని తెలిపారు నిర్మాత దిల్ రాజు – దర్శకుడు వేణు శ్రీరామ్.

గత కొన్ని నెలల నుంచి ఐకాన్ ఆగిపోయింది అనే రూమర్ కు ఈ అనౌన్స్మెంట్ తో చెక్ పలికారు ఐకాన్ ప్రొడ్యూసర్ . ప్రస్తుతం అల్లు అర్జున్ కి ఉన్న కమిట్మెంట్స్ తో ఐకాన్ ఎప్పడు పట్టాలెక్కుతుందో చూడాలి . బన్నీ ప్రస్తుతం పుష్ప షూట్ లో బిజీ గా ఉండగా , బన్నీ – కొరటాల సినిమా పోస్టుపోన్ అవ్వడం తో పుష్ప తరువాత ఐకాన్ ని పట్టాలెక్కిస్తాడేమో చూడాలి .

Check out Allu Arjun Icon Announcement by DilRaju :