ఆ ర్యూమర్లపై త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చేది ఎప్పుడో

ntr trivikram koratala siva | ఎన్టీఆర్ 30 వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కవలసింది. అయితే అనూహ్యంగా త్రివిక్రమ్ స్థానంలో కొరటాల శివ రావటం, సినిమా అనౌన్స్ చేసిన రోజే విడుదల తేదీ ప్రకటించేయటం జరిగిపోయాయి. ఇలా అప్పుడప్పుడు డేట్స్ తేడా వల్లనో లేక ఇతరత్రా కారణాల వల్లనో సినిమా దర్శకులు మారటం సహజమే. అయితే త్రివిక్రమ్ అనుకున్నప్పుడు హారిక హాసిని నిర్మాతలు కావాల్సింది

అయితే ఇప్పుడు ఆ నిర్మాతలు కూడా మారిపోవటం ఫిలిం నగర్లో రకరకాల చర్చలకు దరి తీస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా ర్యూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ తన నెక్స్ట్ ఏంటి అనేది క్లారిటీ ఇచ్చేసాడు. త్రివిక్రమ్ కూడా క్లారిటీ ఇచ్చేవరకు ఈ ర్యూమర్లు ఇలాగె కొనసాగుతాయేమో. ప్రస్తుతానికి అయితే మహేష్ తో త్రివిక్రమ్ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది.