ఐటెం సాంగ్ అంటారేంటి ? స్పెషల్ సాంగ్ అనచ్చుగా ?

Anasuya item song
Anasuya item song

Anasuya item song | ఈటీవీ ప్రోగ్రామ్స్ తో టాప్ యాంకర్ అయిన అనసూయ సినిమాల్లోనూ పరవాలేదనిపిస్తోంది. అప్పుడెప్పుడో రంగమ్మత్త పాత్ర మినహా పెద్దగా అనసూయకు రిజిస్టర్ అయిన రోల్స్ ఏమి లేవనే చెప్పాలి. ఐటెం సాంగ్స్ లోనూ మెరిసిన ఈ హాట్ యాంకర్ కు అలాంటి రోల్స్ ఎక్కువై పోవటంతో, గతం లో ఐటెం సాంగ్స్ చేయను అనే స్టేట్మెంట్ పడేసింది. కట్ చేస్తే తాజాగా అనసూయ ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని ఈ విషయం పై అడిగిన ప్రశ్నకు స్పందించిన అనసూయ, ఐటెం సాంగ్ అంటారేంటి? అది స్పెషల్ సాంగ్ అనచ్చుగా అంటూ వెరైటీ అర్ధం తీసింది. అంటే వేరే వాళ్ళు చేస్తే ఐటెం సాంగ్, అనసూయ చేస్తే స్పెషల్ సాంగ్ అనమాట.