సారంగ దరియా ట్రోలింగ్ మాములుగా లేదుగా

sai pallavi saranga dariya
sai pallavi saranga dariya

sai pallavi saranga dariya | సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, ఒక్కో పాట విడివిడిగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత చేతుల మీదుగా సారంగ దరియా పాట విడుదలైన విషయం తెలిసిందే. సహజంగానే సాయి పల్లవి డాన్స్ బీట్ సాంగ్ కావటంతో ఈ పాట సోషల్ మెయిల్లో ట్రెండ్ అవుతుంది. అలాగే మరో పక్క ఇప్పటికే ఉన్న పాటను కాపీ కొట్టారు అంటూ ట్రోల్ల్స్ కూడా బాగానే చేస్తున్నారు నెటిజన్లు. గతంలో మా టీవీ లో ప్రసారమైన రేలా రేలా రే అనే ప్రోగ్రాం లో ఒక సింగర్ పాడిన ఫోక్ సాంగ్ ను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.  మీరూ ఓ లుక్ వేసెయ్యండి.