ప్రభాస్ కోసం బాలీవుడ్ డైరెక్టర్ ని రంగంలోకి దింపనున్న మైత్రి మూవీ మేకర్స్

38B8D200 B883 4B79 AD60 A22B0FEB5615
38B8D200 B883 4B79 AD60 A22B0FEB5615

Prabhas Mythri Movie Makers | టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్ధ మైత్రి మూవీ మేకర్స్ , రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కాల్సిన విషయం తెలిసిందే . కానీ అనివార్య కారణాల వాళ్ళ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు .

ప్రభాస్ తో తప్పితే టాప్ హీరోలు చిరు , బాలయ్య ,మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ ఇలా అందరితో తలో ప్రాజెక్ట్  అనౌన్స్చేసారు మైత్రి మూవీ మేకర్స్ .

తాజా సమాచారం ప్రకారం అతి త్వరలో ప్రభాస్ సినిమా ను పట్టాలెక్కించి పనిలో పడ్డారంటే అగ్ర నిర్మాతలు . దానికోసం ఏకంగా బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తోనే కథ చర్చలు మొదలుపెట్టబోతున్నారంట .

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో పఠాన్ ,తరువాత  హ్రితిక్ రోషన్ తో ఫైటర్ సినిమాలని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు .

అటు ప్రభాస్ కూడా సాలార్ , ఆదిపురుష్ సినిమా షూటింగ్లో అలాగే నాగ్ అశ్విన్ సినిమా తో బిజీ గా ఉన్నాడు .. అటుసిద్ధార్థ్ , ఇటు ప్రభాస్ ఇద్దరు కూడా 2022 కళ్ళ తమ తమ కమిట్మెంట్స్ ముగించుకుని 2023 నుంచి  మైత్రి బాటపడతారని ఆశిస్తున్నారు సర్కారు వారి పాట నిర్మాతలు .