శ్యామ్ సింగ రాయ్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ : అదిరిపోయే లుక్ తో అదరగొట్టిన నేచురల్ స్టార్

Shyam Singha Roy First Look
Shyam Singha Roy First Look

Shyam Singha Roy First Look | యంగ్ డైరెక్టర్ టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సన్క్రిత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్‌’.

ఫిదా భామ సాయిప‌ల్లవి, ఉప్పెన భామ కృతి శెట్టి, ప్రేమమ్ భామ మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై వెంక‌ట్ ఎస్‌.బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు ఆవిష్కరించారు దర్శక నిర్మాతలు .

సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెకెక్కుతున్న ఈ సినిమా లో నాని రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు .

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు కోల్‌కతాలో సుధీర్ఘ షెడ్యూల్ జరుగుతోంది. రాహుల్ ర‌వీంద్రన్‌, ముర‌ళీ శ‌ర్మ, అభిన‌వ్‌ గోమ‌టం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .

ఈ చిత్రానికి స‌త్యదేవ్ జంగా క‌థ‌ను స‌మ‌కూర్చగా, మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఎస్ జె వరుగెస్ ఛాయాగ్రాహకుడు .