క్రేజీ రూమర్ : రామ్ చరణ్ – శంకర్ సినిమాకి మ్యూజిక్ అందించనున్న టాప్ మ్యూజిషన్

Ram Charan Shankar Movie
Ram Charan Shankar Movie

Ram Charan Shankar Movie |మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , టాప్ డైరెక్టర్ శంకర్ కలయికలో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు .

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పై రూమర్ లు తెగ చక్కర్లు కొడుతున్నాయి , వాటిలో ఒక ఈ సినిమా కధాంశం కాగా మరొకటి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ .

శంకర్ సినిమా అంటే అందరికి గుర్తొచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ , భారతీయ సినిమా చరిత్రలో వీళ్లది బ్లాక్ బస్టర్ కాంబో .  అయితే ఇప్పుడు కమల్ హాసన్ తో శంకర్ తీస్తున్న ఇండియన్ 2 కి మాత్రం తమిళ అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ని తీసుకున్నాడు ఈ టాప్ డైరెక్టర్.

ఇండియన్ 2 బాణీలకు మైమరచి పోయిన శంకర్ ,చరణ్ తో చేయబోయే సినిమా కి కూడా అనిరుద్ నే కొనసాగించ బోతున్నాడంట. ఈ విషయం పై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ , ఈ న్యూస్ మాత్రం యమా చక్కర్లు కొడుతుంది , మరి ఈ రూమర్ నిజమో కాదో తెలియాలంటే మరి కొన్ని నెలలు ఆగాల్సిందే .

పవన్ కళ్యాణ్ అగ్న్యాతవాసి తో తెలుగు లో అరంగేట్రం చేసిన అనిరుద్ , నాని సినిమాలు జెర్సీ , గ్యాంగ్ లీడర్ లకు మ్యూజిక్ అందించాడు … తాజాగా దళపతి విజయ్ మాస్టర్ సినిమాకు అనిరుద్ అందించిన బాణీలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవల్  .