బిగ్ బాస్ బ్యూటీ, కన్నడ నటి జయశ్రీ రామయ్య ఆత్మహత్య

జయశ్రీ రామయ్య
జయశ్రీ రామయ్య

బుల్లితెర మెగా గేమ్ షో బిగ్ బాస్ కన్నడ తో బాగా పాపులర్ అయిన కన్నడ నటి జయశ్రీ రామయ్య తన నివాసంలో శవమై కనిపించింది. నిన్న మధ్యాహ్నం సమయంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. కన్నడ మీడియా కథనం ప్రకారం ఆమె ఆదివారం అర్ధరాత్రే ఆత్మ హత్య చేసుకుందట. ఈమె చాలాకాలం నుండి డిప్రెషన్ తో పోరాడుతుందని తెలుస్తుంది.

గతేడాది సోషల్ మీడియా లో డిప్రెషన్ పై పోస్ట్ పెట్టిన జయశ్రీ రామయ్య, అది వైరల్ అవటం తో తీసేసింది. ఆత్మహత్య చేసుకునే ఆలోచన అప్పటి నుంచే వుండచ్చేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. జయశ్రీ రామయ్య అసహజ అకాల మరణం కన్నడ సినీ పరిశ్రమను విస్మయానికి గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.