నాగ చైతన్య తలుపు తట్టిన బాలీవుడ్

నాగ చైతన్య
నాగ చైతన్య

నాగ చైతన్య ప్రస్తుతం సాయి పల్లవితో లవ్ స్టోరీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలపై ఇంకా స్పష్టత లేదు. టాలీవుడ్ బడా హీరోలంతా పాన్ ఇండియా స్థాయి సినిమాలకే మొగ్గు చూపుతున్నారు. కారణం 50.శాతం సీటింగ్ తో బడా సినిమాలు బ్రేక్ ఈవెన్ అవటం దాదాపు అసాధ్యమే. దానికి ప్రత్యామ్నాలే పాన్ ఇండియా, మల్టీ స్టారర్, లో బడ్జెట్. తాజాగా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర విజయ్ సేతుపతి చేయాల్సింది.

అయితే కరోనా మూలంగా ప్లానింగ్ మారిపోయి డేట్స్ ప్రాబ్లెమ్ తో విజయ్ సేతుపతి చాలా సినిమాలు వదులుకున్నాడు. వాటిలో అమీర్ ఖాన్ సినిమా ఒకటి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ రోల్ కోసం నాగ చైతన్య ను ఫైనల్ చేశారట. గతంలో నాగార్జున బాలీవుడ్ లో చాలా చిత్రాల్లో నటించి, కొంత సక్సెస్ అయ్యాడు. నాగ చైతన్య కు అమీర్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ దొరికినట్టే. అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.