ఆహా లాంటి ఓటిటీ కి కౌంటర్ ఇచ్చి నెట్‌ఫ్లిక్స్ స్థాయి తగ్గించుకుందా?

నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ రీమేక్ తో తెలుగులో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రచారంలో భాగంగా పిట్ట కథలు టీజర్ విడుదల చేస్తూ, నెట్ ఫ్లిక్ ఒరిజినల్స్ అని తెలియచేసారు. దీంతో ఆహా వారు ఆలోచన లేకుండా ‘మా దగ్గర చాలా ఒరిజినల్స్ వున్నాయి.. మేము అరుస్తున్నామా?’ అని సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది. అయితే ఏనుగు వెళుతుంటే కుక్కలు చాలా మొరుగుతుంటాయి అన్నట్టు నెట్ ఫ్లిక్ అసలు పట్టించుకోలేదు. నిజానికి నెట్ ఫ్లిక్ ముందు ఆహా ఒక పిట్టంత. వారికున్న కంటెంట్ లో 2 శాతం కంటెంట్ కూడా లేని ఆహా వాగుడు నెట్ ఫ్లిక్ పట్టించుకోక పోయినా, నెటిజన్లు బాగానే గడ్డి పెట్టారు.

అయితే అంతా ముగిసిపోయింది అనుకునే టైం లో నెట్ ఫ్లిక్ పోస్ట్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. అయితే ఆహా వారి లాగా చిల్లరతనంగా కాకుండా, సెటైర్ కూడా హుందాగానే ఉండటం విశేషం. నెట్ ఫ్లిక్ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి అనేది సరిగా క్లారిటీ లేకపోయినా, ఎవరికీ నచ్చిన విధంగా వారు వూహించుకుంటున్నారు. ముఖ్యంగా ‘వీడు వీడి వేషాలు’ అనే కాప్షన్ కి లైకులు బాగా పడుతున్నాయి.