అనుష్క సమంతలొద్దు రష్మిక కాజల్ లే ముద్దు అంటున్న హీరోలు?

రష్మిక కాజల్
రష్మిక కాజల్

నాగార్జున సరసన సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి సూపర్ ఎంట్రీ ఇచ్చింది అనుష్క శెట్టి. మొదట్లో గ్లామర్ హీరోయిన్ గానే కొనసాగిన అనుష్క అరుంధతి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపొయింది. రాజమౌళి బాహుబలితో అనుష్క రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈమె పక్కన నటించాలంటే హీరోలు సైతం భయపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంత విషయం కూడా దాదాపు ఇలాంటిదే.

పెళ్ళైనా ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది సమంత. అనుష్క సమంత పక్కన నటించినా సినిమా అంతా వారి చుట్టే ఉంటుంది తప్పితే హీరోకి పెద్దగా ప్రాధాన్యత ఉండదని టాలీవుడ్ హీరోలు ఫీల్ అవుతున్నారట. అందుకే కాజల్, తమన్నా, రష్మిక అయితే పరవాలేదు లేకపోతె కొత్త హీరోయిన్లు గానీ పరభాషా హీరోయిన్లను గానీ ప్రిఫర్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్.