సర్కారు వారి పాట తో వరల్డ్ రికార్డు సృష్టించిన సూపర్ స్టార్ ఫాన్స్

Sarkaru Vaari Paata World Record
Sarkaru Vaari Paata World Record

Sarkaru Vaari Paata World Record | సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే తదుపరి చిత్రం సర్కారు వారి పాట , గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ , జీఎంబీ ఎంటర్టైన్మెంట్ , 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న సంగతి విదితమే .

Also Read : మహాశివరాత్రి కి విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే

ఈ సినిమా చిత్రీకరణ ఇంకా మొదలు కాకుండానే రికార్డుల వర్షం కురిపిస్తుంది , ఒకవైపు చిత్ర హక్కుల పై డిస్ట్రిబ్యూటర్లు కోట్ల రూపాయలు ఆఫర్లతో హంగామా చేస్తుంటే , మరో వైపు సూపర్ స్టార్ అభిమానులు ట్విట్టర్ వేదికగా వరల్డ్ రికార్డు సృష్టించారు ..

Also Read : మైత్రి మూవీ మేకర్స్ కి భారీ ఆఫర్ ఇచ్చిన వరంగల్ శీను – దిల్ రాజు పై ఈగో…

ట్విట్టర్ లో సర్కారు వారి పాట మూవీ హాష్ టాగ్ పై 100 M ట్వీట్స్ వేసి ప్రపంచం లో మరి ఏ సినిమా కు లేని ఘనతను సాధించారు .. ఈ వరల్డ్ రికార్డులు మహేష్ అభిమానులకు కొత్తేమి కాదు , ఇదివరకే మహేష్ బాబు పుట్టినరోజు పురస్కరించుకుని చేసిన ట్రెండ్ కూడా అప్పట్లో వరల్డ్ రికార్డే.

అటు సినిమాల పరంగా మహేష్ రికార్డులు తిరగ రాస్తుంటే , ఇటు హీరోకి తగ్గట్టుగా ఫ్యాన్స్ కూడా తమ హీరోకి ఆన్లైన్ లో రికార్డులు సృష్టించి తమ ప్రేమ చాటుకుంటున్నారు .

మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా , ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు , మధీ ఛాయాగ్రాహకుడు .ఈ సినిమాలోని ఇతర తారాగణం కు సంబందించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది .