మైత్రి మూవీ మేకర్స్ కి భారీ ఆఫర్ ఇచ్చిన వరంగల్ శీను – దిల్ రాజు పై ఈగో కి వెళ్తున్నాడా ?

mythri movie makers
mythri movie makers

mythri movie makers – వరంగల్ శీను ఈ మధ్య కాలం లో ఈ పేరు సినీ అభిమానులకు బాగా వినపడుతుంది , నైజాం లో క్రాక్ సినిమా డిస్ట్రీబ్యూషన్ తీసుకుని చెత్త థియేటర్లు ఇచ్చాడని ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజు ని ఏకిపాడేసాడు , వీళిద్దరి మధ్య ఇప్పుడు గొడవ తారా స్థాయికి చేరుకుంది ..ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాకా ఈ విషయం వెళ్లడం జరిగింది అంటే ఊహించుకోండి .దిల్ రాజు కు పోటీ గా ఇప్పటికే శ్రీకారం నైజాం హక్కులను దక్కించుకున్నాడు warangal sreenu .

 

Also Read : Sharwanand’s Sreekaram Release Date Locked

ఇగో తోనో లేక దిల్ రాజు పై కోపం తోనో mythri movie makers వాళ్లకి ఒక భారీ ఆఫర్ ఇచ్చాడట ఈ యువ డిస్ట్రీబ్యూటర్ , మైత్రి వాళ్లు నిర్మిస్తున్న రెండు భారీ చిత్రాలు మహేష్ బాబు తో సర్కారు వారి పాట, అల్లు అర్జున్ తో పుష్ప లకి నైజాం హక్కులకు గాను ఏకంగా 80 కోట్ల ఆఫర్ ఇచ్చాడంట .

 

Also Read : మహాశివరాత్రి కి విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే

 

ఈ డీల్ పై ప్రస్తుతం ఒక సంధిగ్దద నెలకుంది , అటు మైత్రి వాళ్ళ సినిమాలను నైజాం లో వరసగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు కూడా ఈ సినిమా హక్కులను చేజిక్కించుకోడానికి వేచి చుస్తున్నారు. మైత్రి నవీన్ ఈ డీల్ పై త్వరలో ఒక కొలిక్కి వచ్చే ఆవకాశం ఉంది.

ప్రస్తుతం మారేడుమల్లి లో పుష్ప షూట్ జరుగుతుండగా , 25 నుంచి దుబాయ్ లో సర్కారు వారి పాట మొదలవనుంది . ఈ పాటికే సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ మరియు ఇతర తారాగణం దుబాయ్ చేరుకున్నారు ..