ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు చేసుకున్న శ్రీకారం

Sreekaram Release Date locked
Sreekaram Release Date locked

Sreekaram Release Date Locked |యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘శ్రీ‌కారం’‌. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ న‌టిస్తున్నారు. 14  రీల్స్ ప్ల‌స్‌  బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read :SaiDharam Tej’s Republic Release Date

మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ‘శ్రీ‌కారం’ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో గ‌ళ్ల లుంగీ, కాట‌న్ ష‌ర్ట్‌, భుజాన కండువాతో న‌వ్వుతూ నిల్చొని వున్న శ‌ర్వానంద్ క‌నిపిస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా పాత్ర‌లో, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో న‌డిచే స్టోరీలో శ‌ర్వానంద్ అల‌రించ‌నున్నారు. ‘శ్రీ‌కారం’కు సంబంధించి విడుద‌ల చేసిన “బ‌లేగుంది బాలా”, “సంద‌ళ్లె సంద‌ళ్లే సంక్రాంతి సంద‌ళ్లే..” పాట‌లు సంగీత ప్రియుల‌ను బాగా అల‌రిస్తున్నాయి. యూట్యూబ్‌లో వీటికి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే స్పెష‌ల్ టీజ‌ర్‌కు వ‌చ్చిన స్పంద‌న అపూర్వం.

Also Read : Female lead locked for RamCharan in Acharya

‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న‌ రెండో చిత్రం ‘శ్రీ‌కారం’.

‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌’కు మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జె. మేయ‌ర్ ‘శ్రీ‌కారం’ చిత్రానికీ చ‌క్క‌ని బాణీలు అందిస్తున్నారని ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు రుజువు చేస్తున్నాయి. బుర్రా సాయిమాధ‌వ్ డైలాగ్స్, జె. యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లు కానున్నాయి.

తారాగ‌ణం:
శ‌ర్వానంద్‌, ప్రియాంకా అరుళ్ మోహ‌న్‌, రావు ర‌మేష్‌, ఆమ‌ని, న‌రేష్‌, సాయికుమార్‌, ముర‌ళీ శ‌ర్మ‌, స‌త్య‌, స‌ప్త‌గిరి.

సాంకేతిక బృందం:
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
మ్యూజిక్‌: మిక్కీ జె. మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: జె. యువ‌రాజ్‌
ఎడిటింగ్‌: మార్తాండ్ కె. వెంక‌టేష్‌
ఆర్ట్‌: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: హ‌రీష్ క‌ట్టా
నిర్మాత‌లు: రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌
ద‌ర్శ‌కుడు: కిశోర్ బి.
బ్యాన‌ర్: 14 రీల్స్ ప్ల‌స్‌.

Sreekaram Release Date Locked