సంధ్యరాజు `నాట్యం` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌.

Sandhya Raju Natyam Movie First Look Poster
Sandhya Raju Natyam Movie First Look Poster
Sandhya Raju Natyam Movie First Look Poster | హైదరాబాద్‌కు చెందిన సుప్రసిద్ధ కుచిపూడి డాన్సర్ సంధ్యరాజు మొద‌టిసారిగా ఒక‌ తెలుగు సినిమాలో నటించారు. ఆమె త‌న నటన, ఎక్స్‌ప్రెష‌న్స్‌, డ్యాన్స్  ద్వారా ప్రేక్ష‌కుల‌ను మంత్రముగ్దులను చేయ‌నుంది.
 
ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, ప‌రోప‌కారి ఉపాస‌న‌ కొణిదెల ఈ రోజు ఉద‌యం10:08 నిమిషాల‌కు `నాట్యం` ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లో సాంప్రదాయ చీర క‌ట్టుతో క్లాసికల్ డాన్సర్‌గా సంధ్యరాజు తన పాత్రలో ఒదిగిపోయారు. వెన‌క అలంకరించిన నటరాజు విగ్రహం ముందు ఆమె ఒక‌ నాట్య దేవతలా కనిపిస్తున్నారు.
 
ఈ పోస్టర్ ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉండ‌బోతుంది అని తెలుసుకోవాల‌ని ఆసక్తిని క‌లిగిస్తోంది.
 
ఈ మూవీ ద్వారా రేవంత్ కొరుకొండ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రానికి  ర‌చ‌న‌, దర్శకత్వం వహించడంతో పాటు డిఓపి, ఎడిటర్ కూడా అత‌నే..
 
ఈ చిత్రం ఒక గురుశిష్యుల మధ్య ఒక అందమైన ప్రత్యేకమైన సంబంధాన్ని చిత్రీకరిస్తుంది. అలాగే ఒక మంచి ప్రేమకథతో ముడిపడి ఉంది.
 
క‌మ‌ల్‌కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ అంద‌మైన సంగీతాన్ని స‌మ‌కూర్చారు.
 
ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోని హంపి, లేపాక్షి, బెంగళూరు మరియు హైదరాబాద్ లోని అందమైన ఆర్కిటెక్ట్ దేవాలయాలలో విజువల్ బ్యూటీగా నిర్మించబడింది.

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, సినిమాటోగ్ర‌ఫి, ఎడిటింగ్‌, ద‌ర్శ‌క‌త్వం: రేవంత్ కొరుకొండ‌,
ప్రొడ‌క్ష‌న్ హౌస్‌: నిశ్రింకళ ఫిల్మ్స్,
సంగీతం: శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్,
లిరిక్స్‌: క‌రుణాక‌ర్ ఆదిగ‌ర్ల‌,
ఆర్ట్‌: మ‌హేష్ ఉప్పుటూరి,
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: స‌ంధ్య‌రాజు,
విఎఫ్ఎక్స్‌: థ‌ండ‌ర్ స్టూడియోస్‌,
క‌ల‌రిస్ట్‌: ఎమ్‌. రాజు రెడ్డి,
ఎస్ఎఫ్ఎక్స్‌: సింక్ సినిమాస్‌,
సౌండ్ మిక్సింగ్‌: కృష్ణంరాజు,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: వాల్మికి శ్రీ‌నివాస్‌,
డిజిట‌ల్ ప్ర‌మోష‌న్స్‌: శ‌్రేయాస్ మీడియా,
పిఆర్ఓ: వ‌ంశి- శేఖ‌ర్‌.

 

Here’s the Sandhya Raju Natyam Movie First Look Poster :