అల్లరి నరేష్ నాంది కి భారీ ఆఫర్

naresh
naresh

Allari naresh nandi | విజయ్ దర్శకత్వంలో సతీష్ వేగేశ్న నిర్మించిన వైవిధ్యభరిత చిత్రం నాంది. అల్లరి నరేష్, ప్రియదర్శి, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చాలాకాలం తరువాత అల్లరి నరేష్ సినిమాపై అంచనాలు పెంచింది. రేపు అల్లరి నరేష్ చిత్రం బంగారు బుల్లోడు విడుదలవుతున్న విషయం తెలిసిందే. నాంది కి వచ్చిన బూమ్ తో ముందు నాంది, ఆ తరువాత బంగారు బుల్లోడు విడుదల చేసి ఉంటే బాగుండేదని కొంతమంది సినీ పండితుల అభిప్రాయం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాంది వరల్డ్ నెగటివ్ రైట్స్ అంటే డిజిటల్, ఓటిటి, థియేటర్ అన్ని రైట్స్ కలిపి జీ టీవీ చేజిక్కించుకుంది. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఎనిమిది కోట్లకు బేరం కుదిరినట్లు, అగ్రిమెంట్ మాత్రం ఇంకా కాలేదని తెలుస్తుంది..